సామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జీ:-
వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా.. సామ్సంగ్ గెలాక్సీ ఎం34 ఇవ్వాలని చూస్తున్నారా? అయితే.. ఫీచర్స్ ఇక్కడ తెలుసుకోండి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఎక్సినోస్ 1280 ఆక్టా కోర్ ప్రాసెసర్ దీని సొంతం. 6000ఎంఏహెచ్ బ్యాటరీ వస్తోంది. 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ సెకెండరీ, 12ఎంపీ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా దీని సొంతం. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13ఎంపీ ఫ్రెంట్ కెమెరా వస్తోంది. ఆండ్రాయిడ్ 13పై ఇది పని చేస్తుంది.