లక్కీ భాస్కర్ మూవీలో బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. లక్కీ భాస్కర్ సినిమాను తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.