2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు
కేబినెట్ నిర్ణయాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే ప్రక్రియ మొదలైందన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యం కనిపించలేదన్నారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు. తెలంగాణ హైకోర్టు నూతన భవనాలకు 100 ఎకరాలు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 65 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్ డేట్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయించింది.