Home తెలంగాణ ప్రపంచ నలుమూలలకు నిర్మల్ కొయ్య బొమ్మలు-nirmal handicrafts is reaching all over the world...

ప్రపంచ నలుమూలలకు నిర్మల్ కొయ్య బొమ్మలు-nirmal handicrafts is reaching all over the world through online bookings ,తెలంగాణ న్యూస్

0

అమెజాన్లో నిర్మల్ కొయ్య బొమ్మలు :

నూటికి నూరు శాతం చేతులతో తయారుచేసే ఈ కొయ్య బొమ్మలలో తయారు చేయబడిన వస్తువు అంటూ లేదు, తినే పాన్ పోక చెక్కలు, రక రకాల పక్షులు, అనేక రకాల జంతువులు, వర్ణ చిత్రాలు, దేవుళ్ళ చిత్రపటాలు, వాల్ పెయింటింగ్స్ ఎన్నో వందలాది రకాల వస్తువులు తయారు చేస్తారు, వీటన్నిటికీ కూడా పోనికి కర్ర, సహజ రంగులనే వాడుతారు. ఇలాంటి చిత్రాలు ప్రపంచ ఆదరణ పొందడంతో అమెజాన్లో కొనుగోలు చేసుకోవడానికి స్థానిక కలెక్టర్ చర్యలు చేపట్టారు, వాటి పార్సిలను ప్రత్యేక కర్ర బాక్సులలో సప్లై చేయడానికి మహిళా సంఘాలకు శిక్షణ ఇస్తున్నారు, ఏదేమైనా 400 ఏళ్ల చరిత్ర గల నిర్మల్ కొయ్య బొమ్మల కలను బ్రతికించడానికి అధికారులు మరిన్ని విస్తృత చర్యలు చేపట్టాల్సి ఉంది. స్థానికంగా పాలకులకు అధికారులకు శుభకార్యాలకు శాలువాలు పూలమాలలు కాకుండా నిర్మల్ కొయ్య బొమ్మలతో సత్కరించడానికి ఏర్పాట్లు చేస్తే, కొయ్య బొమ్మల పారిశ్రామిక కేంద్రం మరింత అభివృద్ధి చెందుతుందని నిర్మల్ యూనిట్ మానేజర్ బీ.ఆర్. శంకర్ తెలుపుతున్నారు. హస్తకళ మాతోనే సమాప్తం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం కనీస వేతనం చెల్లించి వంశపారంపర్యంగా వచ్చేకలను ఆదుకోవాలని అంటున్నారు. ప్రభుత్వం ద్వారా హెల్త్ కార్డు, పిల్లల చదువుల్లో రాయితీ, బ్యాంకు రుణాలు, ప్రత్యేక శిక్షణ తరగతులు, ఉద్యోగ భద్రత లాంటి చర్యలు చేపడితే తమ పిల్లల సైతం కలలు నేర్చుకోవడానికి ముందుకు వస్తారని తెలుపుతున్నాడు.

Exit mobile version