25 మంది స్వామీజీల అనుగ్రహ భాషణం
మొదటి రోజు ఈ సదస్సుకు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, బెంగళూరు శ్రీ వ్యాసరాజ మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థ స్వామీజీ, కుర్తాళం మౌనస్వామి మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతిస్వామి, తిరుపతి రాయలచెరువుకు చెందిన భారతి శక్తిపీఠం మాతృశ్రీ రమ్యానంద, విజయవాడకు చెందిన శ్రీశ్రీశ్రీ అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి, భీమవరానికి చెందిన భాష్యకార సిద్ధాంత పీఠం శ్రీశ్రీశ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి, శ్రీనివాసమంగాపురానికి చెందిన శ్రీ లలితా పీఠం శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామి, ఏర్పేడు వ్యాసాశ్రమానికి చెందిన శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానందగిరి స్వామి, కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ, కడప బ్రహ్మంగారి మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ విరజానంద స్వామి, గుంటూరుకు చెందిన శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజి, తుని తపోవనానికి చెందిన శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, నెల్లూరుకు చెందిన సత్యానంద ఆశ్రమం శ్రీశ్రీశ్రీ హరితీర్థ స్వామీజీ, విజయవాడలోని జ్ఞాన సరస్వతి పీఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ ప్రకాశానంద సరస్వతి స్వామి, తేనెపల్లికి చెందిన చైతన్య తపోవనం మాతా శివానంద సరస్వతి, మాతా సుశ్రుశానంద, ప్రొద్దుటూరుకు చెందిన శివ దర్శనం మాతాజీ, ఉత్తరకాశీకి చెందిన శ్రీశ్రీశ్రీ స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామి, విజయవాడకు చెందిన చిదానంద ఆశ్రమం శ్రీశ్రీశ్రీ సత్యానంద భారతి, గుంటూరుకు చెందిన శైవక్షేత్రం శ్రీ శివ స్వామి, హైదరాబాదుకు చెందిన శ్రీశ్రీశ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి, విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి హాజరయ్యారు.