మంగళగిరి ఎయిమ్స్ లో టీచింగ్ పోస్టులు
AIIMS Mangalagiri Jobs : మంగళగిరి ఎయిమ్స్(AIIMS)లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిమ్స్ లో మెడికల్ సూపరింటెండెంట్, రిజిస్ట్రార్, నర్సింగ్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇంటర్య్వూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.2,18,200 జీతాభత్యాలు ఇస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీలోపు మంగళగిరి ఎయిమ్స్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో తెలిపారు.