మౌలిక వసతుల లేమి
లక్షద్వీప్ పై పర్యాటకుల, ముఖ్యంగా భారతీయ పర్యాటకులకు ఆసక్తి పెరిగింది. కానీ, ఆ మేరకు పెరిగే పర్యాటకుల అవసరాలను తీర్చే మౌలిక వసతులు ఆ ద్వీప సమూహంలో లేవు. ముఖ్యంగా, ఈ ద్వీపాలకు ప్రత్యక్ష కనెక్టివిటీ లేకపోవడం, తగినన్ని హోటళ్లు, పర్యాటక సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు ఈ ద్వీపాలను సందర్శించకుండా నిరోధించవచ్చని పరిశ్రమ నిర్వాహకులు తెలిపారు. భారత్ లోని బీచ్ లున్న అన్ని ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రత్యక్ష కనెక్టివిటీ ఉందని అపెక్స్ ట్రావెల్ అండ్ టూర్స్ యజమాని విపి నరులా చెప్పారు. డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ ప్రయాణికుడికి సమయాన్ని, ఖర్చును ఆదా చేస్తుందని ఆయన అన్నారు.