AP Assembly Elections 2024 : ఎన్నికల ఏడాదిలోకి వచ్చిన వేళ ఆంధ్రా రాజకీయాలు మారిపోతున్నాయి. ఇప్పటివరకు ఓ లెక్క… ఇకనుంచి మరోలెక్క అన్నట్లు పాలిటిక్స్ సాగుతున్నాయి. ప్రత్యర్థిని కొట్టేందుకు ప్రధాన పార్టీలు ఏ ఛాన్స్ ను విడిచిపెట్టే అవకాశం కనిపించటం లేదు. సర్వేలు, సామాజిక సమీకరణాలు, నేతల బలబలాలు ఇలా ఒకటి కాదు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి పార్టీల అధినాయకత్వాలు. సిట్టింగ్ లను కూడా పక్కనపెట్టి… గెలిచే రేసుగుర్రాలకే టికెట్ ఇవ్వాలని చూస్తున్నాయి. ఇక పొత్తుల్లో భాగంగా తమ సీటుకు ఎసరు వస్తుందా అన్న భయం కూడా ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోంది.