Sankranti Festival Dates: సంక్రాంతి పండుగ తేదీ ప్రతి 72 ఏళ్లకోసారి మరుసటి రోజుకు మారుతూ వస్తోంది. ఆశ్చర్యం కలిగించినా ఇది నూటికి నూరుపాళ్ల నిజమని శాస్త్రం చెబుతోంది. 2008వ సంవత్సరం నుంచి సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీన రావడం ప్రారంభమయింది. అంతకు ముందు 1935వ సంవత్సరం నుంచి 2007 వరకు జనవరి 14నే పండుగ వచ్చింది. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒక రోజు తర్వాతకు మారడాన్ని మనం గమనించవచ్చు. 1935 నుంచి 2007 వరకు జనవరి 14న, 2008 నుంచి 2080 వరకు జనవరి 15న,2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుంది.