Home ఆంధ్రప్రదేశ్ హైటెక్ హంగులతో బరులు రెడీ, పందాలకు కోడి పుంజులు సై!-bhimavaram news in telugu sankranti...

హైటెక్ హంగులతో బరులు రెడీ, పందాలకు కోడి పుంజులు సై!-bhimavaram news in telugu sankranti festival cock fight arena with high tech facilities ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

గోదావరి జిల్లాల్లో భారీ ఏర్పాట్లు

ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తు్న్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 100కు పైగా పెద్ద బరులు, వేల సంఖ్యలో చిన్న బరులను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భోగి రోజు మధ్యాహ్నం నుంచి కోడిపందాలకు అనధికారికంగా అనుమతి లభిస్తుంది. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, వీరవాసరం, యలమంచిలి, ఆచంట, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, దెందులూరి, కైకలూరులో బరులు సిద్ధం చేసిన పందెంరాయుళ్లు అనుమతుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వీటితో సంక్రాంతి ఎడ్ల పందాలు నిర్వహించడం ఆనవాయితీ. రాష్ట్రంలోని పలు ప్రాంతాలను నుంచి వచ్చిన ఎడ్లు పందాల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు పలు చోట్ల పందులతో పందాలు నిర్వహిస్తుంటారు.

Exit mobile version