కొరియన్స్ అందం గురించి పాటించే చిట్కాలు బాగుంటాయి. సహజమైన పదార్థాలను ఉపయోగిస్తారు. అలాంటి బ్యూటీ సీక్రెట్లలో ఒకటి మృదువైన, పొడవాటి జుట్టు కోసం బియ్యం నీటిని ఉపయోగించడం. విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్లతో సమృద్ధిగా ఉన్న రైస్ వాటర్‌ను కొరియన్ మహిళలు తరతరాలుగా జుట్టు ఆకృతిని, మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారు. మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు కూడా కొరియన్ రైస్ వాటర్ ఉపయోగించవచ్చు.