Saturday, October 26, 2024

గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్.. వరల్డ్ రికార్డు కొట్టిన మహేష్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది ఏ నిమిషమైన తుఫాన్ రావచ్చని వాతావరణ శాఖ నుంచి ఏ రకంగా అయితే రిపోర్ట్ వస్తుందో ఇప్పుడు మహేష్ గుంటూరు కారం(guntur kaaram)విషయంలో కూడా సేమ్ అదే జరుగుతుంది. మహేష్ (mahesh)వన్ మాన్ షో గుంటూరుకారం తొలి రోజు రికార్డు కలెక్షన్స్ ని సాధించింది.మున్ముందు దీని ప్రభావం ఏ స్థాయిలో  ఉంటుందో కూడా చెప్పడం కష్టమనే రేంజ్ లో గుంటూరు కారం  ముందుకు దూసుకుపోతుంది.

గుంటూరు కారం మొదటి రోజు 94 కోట్ల రూపాయలని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల కూడా రికార్డు కలెక్షన్స్ ని సాధిస్తు  అక్షరాలా 94 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించింది.దీంతో కేవలం ప్రాంతీయ భాష తెలుగులో మాత్రమే రిలీజైన గుంటూరు కారం రీజనల్ సినిమాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. సినీ ట్రేడ్ వర్గాలు కూడా గుంటూరు కారం కలెక్షన్ల విషయంలో విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 

ఇక గుంటూరు కారం మొదటి రోజు నెగిటివ్ టాక్ ని పొందింది. కానీ కలెక్షన్స్ మాత్రం సూపర్ గా ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. అలాగే మూవీకి డివైడ్ టాక్ వస్తేనే కలెక్షన్స్ ఒక రేంజ్ లో ఉంటే ఇంక పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే పరిస్థితి ఏంటని కూడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana