పతంగులు ఎగరవేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సంక్రాంతి అంటేనే పతంగుల పండగ వయసుతో సంబంధం లేకుండా…… ప్రతి ఒక్కరూ పతంగులు ఎగరేస్తూ ఉంటారు. ఈ పండుగ వేళా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పండుగ ఆనందంగా జరుపుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు, పోలీసులు చెబుతున్నారు. విద్యుత్ స్తంభాలు, తీగలు లాంటి ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాలు లేని చోట పతంగులు ఎగరవేయడం మంచిది అంటున్నారు. బహిరంగ ప్రదేశాలు, మైదానంలో పతంగులు ఎగురవేయాలి. విద్యుత్ స్తంభాలు, తీగలు ట్రాన్స్ఫార్మర్ల వద్ద గాలిపటాలు వేయకూడదు. పిల్లలు, యువకులు విద్యుత్ వైర్ల మీద పడిన గాలిపటాలను తీసేందుకు ప్రయత్నించవద్దు కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంది. కాటన్, నైలాన్ తో చేసిన మాంజాలను మాత్రమే వాడాలి. మెటాలిక్ మాంజా వాడొద్దు. మెటాలిక్ భవనాల మీద నుంచి గాని, సగం నిర్మించిన గోడల మీద నుంచి పతంగులు ఎగరవేయే ప్రయత్నం చేయొద్దు. పిల్లలు పతంగులు ఎగరవేసే సమయంలో పెద్దలు దగ్గర ఉండటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.