హ్యూస్టన్ లో కార్ ర్యాలీ
మరోవైపు, అయోధ్య (Ayodhya) రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని హ్యూస్టన్ లో ఇప్పటికే ఒక భారీ కార్ ర్యాలీని నిర్వహించారు. అమెరికాలోని హిందూ వర్గం ఈ ర్యాలీ నిర్వహించింది. మార్గమధ్యంలో ఉన్న 11 హిందూ దేవాలయాల వద్ద ర్యాలీని నిలిపి ప్రత్యేక పూజలు చేశారు. యాత్ర పొడవునా వారు భజనలు ఆలపిస్తూ ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ కొనసాగారు. కాషాయ బ్యానర్, అయోధ్య రామమందిర నమూనాను, భారత జెండా, అమెరికా జెండాలను పట్టుకుని సుమారు 500 మంది ఈ కార్ ర్యాలీలో పాల్గొన్నారు. 216 కార్లు, బైక్లు పాల్గొన్న ఈ ర్యాలీ సుమారు 3-మైళ్ల పొడవు ఉంది. అమెరికాలోని పలు దేవాలయాలు కూడా అయోధ్య రామమందిర ప్రారంభోత్సం పురస్కరించుకుని వారం రోజుల పాటు వేడుకలను నిర్వహించనున్నాయి.