ఏపీలో మూడు కొత్త రైళ్లను జెండా ఊపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. హుబ్బల్లి-నర్సాపూర్, విశాఖ-గుంటూరు, నంద్యాల-రేణిగుంట రైళ్లకు శ్రీకారం చుట్టారు. సంక్రాంతి పండుగకి రద్దీ ఉంటుందని, అందుకే ఈ సందర్భంగా ఈ రైళ్లను ప్రారంభించామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ పట్టణాల నుంచి పల్లెలకు తరలి వెళ్లే పండుగ ఇది అని అన్నారు. అయోధ్య రామాలయం గురించి సైతం మాట్లాడారు.