ప్రస్తుతం నెగెటివ్ టాక్‌తో గుంటూరు కారం మూవీ ట్రెండ్ అవుతోంది. అంతేకాకుండా మాటల మాంత్రికుడు, డైరెక్టర్ తివిక్రమ్‌ను మహేశ్ బాబు అభిమానులు ఘోరంగా తిడుతున్నారు. థియేటర్‌లో దొరికితే కొట్టేవాళ్లమంటూ కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో, అజ్ఞాతవాసి ఇలా సినిమాలన్నింటిని కలిపి ఏదో ఒకటి తీసినట్లుగా ఉందని మండిపడుతున్నారు. కనీసం ఈ సినిమాల్లో స్టోరీ ఉందని, గుంటూరు కారం మరీ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.