కేశినేని నాని అవినీతి పరుడని నిరూపించటానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తన ఆస్తులు ఎనికేపాడులో ఉన్నాయని అందుకే గన్నవరం నుంచి నాగార్జున సాగర్ మధ్యలో రాజధాని ఏర్పాటు చేయమని చెప్పాడని తెలిపారు.2009 నుంచి 2024 మధ్య కాలంలో కేశినేని నాని మూడు పార్టీలు మారారని విరుచుకుపడ్డారు. వైసీపీ పని అయిపోవడం వల్లే కేశినేని నానికి జగన్ టిక్కెట్ ఇచ్చారని అన్నారు. కేశినేని నాని కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడని ఘాటుగా మాట్లాడారు బుద్దా వెంకన్న.కేశినేని నాని ఓ బచ్చా అని, విజయవాడను అభివృద్ధి చేసింది చంద్రబాబు అని తెలిపారు.