కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రాభివ్రుద్థి
కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రాభివ్రుద్థి, కాంగ్రెస్ పార్టీలోనే ప్రజాస్వామ్యం అంటూ చెప్పిన పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు… రెండు రోజుల మాణిక్కం ఠాగూర్ పర్యటనలో జిల్లా, నగర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, సేవాదళ్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ విభాగాలకు చెందిన సుమారు 150 మంది నేతలతో సంభాషించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారని వెల్లడించారు. యువత సమస్యలపై ఒంగోలులో నిర్వహించిన యువభేరి కార్యక్రమం కూడా విజయవంతం అయ్యిందన్నారు. అదే విధంగా 685 మండల అధ్యక్షులను, 26 జిల్లాల కమిటీలను ఇప్పటికే నియమించామని తెలిపారు. మాణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో పార్టీ విభాగాల పనితీరు, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే వివిధ అంశాలపై చర్చించామన్నారు.