నా సామిరంగ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున ఆసక్తికర కామెంట్స్ చేశారు. “అందరికీ, అక్కినేని అభిమానులకు నమస్కారం. సంక్రాంతి అంటే సినిమా పండగ. టీవీలు వచ్చినపుడు సినిమాలు ఇంక చూడరని అన్నారు. తర్వాత ఫోన్లు వచ్చాయి చూడరని అన్నారు. డీవీడీలు, డిజిటల్ వచ్చిన తర్వాత చూడరని అన్నారు. కానీ, ప్రేక్షకులు సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఓటీటీ వచ్చిన తర్వాత చూడరు అన్నారు. కానీ చూస్తూనే ఉన్నారు” అని నాగార్జున అన్నారు.