Home ఎంటర్టైన్మెంట్ ఫైనల్ గా నాగార్జున పోరాడేది ఎవరితోనో తెలిసిపోయింది

ఫైనల్ గా నాగార్జున పోరాడేది ఎవరితోనో తెలిసిపోయింది

0

అక్కినేని నాగార్జున హీరోగా సంక్రాంతి కానుకగా ఈ నెల 14 న రిలీజ్ అవుతున్న మూవీ నా సామి రంగ.  కింగ్ నాగార్జున  కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ మీద నాగ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ ట్రైలర్ కూడా అదిరిపోవడంతో మూవీ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీలో నటించిన ఒక నటుడు ఇప్పుడు టాక్ ఆఫ్ ది డే గా నిలిచాడు.

నా సామి రంగ కి సంబంధించి కథలో అత్యంత కీలక పాత్ర పోషించిన దాస్ పాత్రని మేకర్స్ పరిచయం చేసారు. సర్పట్టా పరంబరై,కింగ్ ఆఫ్ కొత్త సినిమాల్లో అధ్బుతంగా నటించి తన నటనతో ఎంతో మందిని మెస్మైర్ చేసిన  షబీర్ ఇప్పుడు నా సామి రంగ లో దాస్ గా అందర్నీ అలరించబోతున్నాడు. జీప్ మీద కంప్లీట్ విలన్ లుక్ తో కనపడుతున్న షబీర్ పోస్టర్ సూపర్ గా ఉంది. ఇప్పుడు ఈ లుక్ తో మూవీ మీద అందరిలోను అంచనాలు రెట్టింపు అయ్యాయి.మూవీలో నాగార్జునకి షబీర్ కి మధ్య పోరాట సన్నివేశాలు కూడా  సూపర్ గా వచ్చాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. 

ఆషికా రంగనాధ్ హీరోయిన్ గా నటిస్తున్న నా సామి రంగ నుంచి ఇటీవల వచ్చిన అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే ఆ పాటలు రెండు తెలుగు స్టేట్స్ లో ఎక్కడ చూసినా మారుమోగిపోతున్నాయి. అల్లరి నరేష్ ,రాజ్ తరుణ్,మిర్న మీనన్, రుక్సార్ థ్రిల్లన్ ,నాజర్ లు నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నాడు.ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించాడు. 

 

Exit mobile version