Sangareddy Protocol: సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రోటోకాల్ పైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రోజుకు రోజులకు గొడవలు పెడుతున్నాయి. ప్రోటోకాల్ సరిగ్గా పాటించడం లేదని, బీఆర్ఎస్ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు, చీఫ్ సెక్రటరీ ఏ శాంతి కుమారి కి లేఖ రాశారు. రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన గురించి లేఖలో వివరిస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే ప్రజలు ప్రభుత్వం పైన నమ్మకం కోల్పోతారన్నారు.