Mallanna Jatara: ఈ నెల 13న ధ్వజారోహణతో మల్లన్న జాతర ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. 14న భోగి, 15న సంక్రాంతి, 16 కనుమ పండుగ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.ఉత్తర తెలంగాణ ప్రజలు కొంగుబంగారంగా కొలిచే ఐలోని మల్లన్న ఉత్సవాలకు మన రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ గడ్ నుంచి మొత్తం సుమారు 10 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంది.