Wednesday, October 16, 2024

పేకాట గ్యాంగ్ లో సర్పంచ్ భర్త…!!

  • పేకాట గ్యాంగ్ లో సర్పంచ్ భర్త…!!
  • టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
  • 11 మంది అరెస్ట్
  • నగదు కారు సెల్ ఫోన్ ల స్వాధీనం
  • కొంశ ట్ పల్లి ఫామ్ హౌస్ లో ఘటన

వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 12 (జనవాహిని న్యూస్) :- అది ప్రభుత్వ మిగులు భూమి. జీవన ఉపాధి కోసం అప్పట్లో ఆ గ్రామ ప్రస్తుత సర్పంచ్. తోపాటు ఆమె భర్తకు అధికారులు ప్రభుత్వమే కేటాయించారు. అదే ఆయనకు వరమైంది. ఆ భూమి జాతీయ రహదారికి దగ్గరలో ప్రాజెక్టుకు చేరువలో ఉండడంతో ఆ భూమిలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మార్చారు. సర్పంచ్ భర్త దర్జాగా ప్రభుత్వ మిగులు భూమిలో షెడ్ నిర్మించి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసు బృందం మెరుపు దాడి చేసి భారీగా నగదు మొబైల్స్ కారు స్వాధీనం చేసుకొని సర్పంచ్ భర్తతో సహా 11 మందిని అరెస్టు చేశారు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని కొంశట్ పల్లి గ్రామంలోని ఫామ్ హౌస్ లో జరిగింది టాస్క్ ఫోర్స్ బృందం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం పేకాట ఆడుతున్న ఫామ్ హౌస్ పై గురువారం రాత్రి దాడి చేసింది. ఈ దాడిలో 11 మంది నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందం పట్టుకుంది టాస్క్ ఫోర్స్ బృందంలో మరుపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి తో పాటు టాస్క్ ఫోర్స్ ఇంచార్జి ప్రశాంత్ వర్ధన్ పేకాట ఆడుతున్న ఫామ్ హౌస్ లోని స్థావరంపై దాడి చేసిన వారిలో ఉన్నారు పేకాట కార్డులతో పాటు రెండు లక్షల 32 వేల రెండు వందల డెబ్బై రూపాయలు 11 సెల్ ఫోన్ లు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు వాటిని మర్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు సర్వే నంబర్ 303 లో ఆ గ్రామ సర్పంచ్ ఆమె భర్తకు ఐదు ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి ఉంది అందులో ఒక షెడ్డు నిర్మాణం చేసి రోజు పేకాట ఆడిస్తున్నట్లు పోలీసులు పక్క సమాచారం ఉంది పేకాట రాయుళ్లకు ఆట ఆడుతున్నంత సేపు సకల సౌకర్యాలు కల్పిస్తూ వారిని పేకాట వైపు ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తుంది ఫలితంగా ఫామ్ హౌస్ యజమాని సర్పంచ్ భర్తకు భారీగా నజరానా పేకాట రాయుళ్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది కాగా పేకాట ఆడుతూ పట్టుబడిన వారి వివరాలను మర్పల్లి పోలీసులు వెల్లడించవలసి ఉంది తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనిచివేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడంతో గత కొంతకాలంగా పోలీసులు ఫామ్ హౌస్ లపై అనుమానితులపై నిఘా వేసి దాడులు నిర్వహిస్తున్నారు గత వారం రోజుల క్రితం జాతీయ రహదారి నుంచి ఇది ప్రాంతం గుండా కొంత గంజాయిని కారులో తరలిస్తుండగా వాహనాల తనిఖీ లో భాగంగా పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తుంది ఈ విషయమై సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయినట్లు విశ్వనీయ సమాచారం…..

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana