ఎస్ ఎం ఈ ఐపీఓ
న్యూ స్వాన్ మల్టీటెక్ (New Swan Multitech) చిన్న, మధ్య తరహా పరిశ్రమల కేటగిరీలోకి వస్తుంది. లేటెస్ట్ గా ఈ సంస్థ ఐపీఓను తీసుకువచ్చింది. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కొక్కటి రూ. 62 నుండి రూ. 66 మధ్య ఉంది. ఇన్వెస్టర్లు లాట్స్ లో బిడ్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో లాట్ లో 2000 ఈక్విటీ షేర్లు ఉంటాయి. అంటే, ఒక లాట్ కు గరిష్ట ప్రైస్ బ్యాండ్ తో బిడ్డింగ్ చేయాలంటే కనీసం రూ. 1.32 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. రిటైల్ పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్, HNIలు కనీసం రెండు లాట్లు బిడ్ చేయాలి.