Saturday, January 11, 2025

ఇక సురేష్ బాబు చేతికి ఆ మూవీ.. 25 న తెలుగు ప్రజలకి పండగే

ధనుష్(dhanush)నయా మూవీ కెప్టెన్ మిల్లర్. తమిళనాడు వ్యాప్తంగా ఈ రోజు రిలీజ్ అయిన ఆ మూవీ పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. ధనుష్ నటనకి తమిళనాడులోని థియేటర్స్ మొత్తం దద్దరిల్లి పోతున్నాయి. వాస్తవానికి తెలుగులో కూడా 12 నే విడుదల కావలసిన కెప్టెన్ మిల్లర్(captain miller)తెలుగు సినిమాల రిలీజ్ ఎక్కువ ఉండటంతో వాయిదా పడింది. ఈ మూవీ కి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి తెలుగు ప్రేక్షకులని ఆనందంలో ముంచెత్తుతుంది.

కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ లో ఈనెల జనవరి 24 న రిలీజ్ కాబోతుంది. తెలుగు హక్కులని ప్రముఖ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్తలైన  సురేష్ ప్రొడక్షన్స్ అండ్ ఏషియన్ సినిమాస్ వారు పొందారు. ఈ మేరకు తమ సంస్థ ద్వారా కెప్టెన్ మిల్లర్ రెండు తెలుగు రాష్ట్రాల్లోను అత్యధిక థియేటర్స్ లో  రిలీజ్ కాబోతుందని సురేష్ ప్రొడక్షన్స్ ఒక పోస్టర్ ని కూడా  రిలీజ్ చేసారు. ఇప్పుడు ఈ వార్త ధనుష్ అభిమానుల్లో ఎంతో సంతోషాన్ని తెచ్చింది.రఘువరన్ బిటెక్ మూవీ తో  తెలుగు లో కూడా ధనుష్ కి భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు.

1930 వ కాలానికి చెందిన ఒక పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ తయారయ్యింది. సినిమాలో నటించిన అందరి ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ తో పాటు ఫొటోగ్రఫీ అండ్ బిజిఎం అదిరిపోయిందని అంటున్నారు. ధనుష్ సరసన ప్రియాంక మోహన్(priyanka mohan) నటించిన ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ , తెలుగు నటుడు సందీప్ కిషన్ లు ప్రధాన పాత్రలు పోషించారు.సత్య జ్యోతి ఫిల్మ్స్ పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ లు నిర్మాతలుగా వ్యవహరించగా అరుణ్ మాతేశ్వరన్ రచనా బాధ్యతల్ని నిర్వర్తించాడు.

 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana