చంద్రబాబు విధానాలే కారణం – బుగ్గన
చంద్రబాబు విధానాల వల్లే తమ ప్రభుత్వం అప్పు చేసిందన్నారు మంత్రి బుగ్గన. “ఊరూరా తిరుగుతూ రాజకీయ సభల్లో మాకు పేర్లు పెడతారా..? ఆయనకు, అయన కుమారుడికి మేము పేర్లు పెట్టలేమా..? వేర్వేరు సమయాల్లో వేర్వేరు పార్టీల తో పెట్టుకుని అవసరం తీరాక వదిలేసే చంద్రబాబు మాకు హితోక్తులు చెబుతారా..? ఏపీలో వైసిపితో తప్ప అన్నీ పార్టీల తో ఆయన పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు చంద్రబాబు మాటలు వింటున్నారు. కానీ గతంలో ఆయన వారి గురించి చేసిన వ్యాఖ్యలు గుర్తు ఉన్నాయా…? మనస్సులో మాట పుస్తకం లో అయన అయా వర్గాల కు సబ్సిడీ ,రాయితీలు వద్దనీ రాసుకున్నారు. రాష్ట్ర విభజనకు కారణమే చంద్రబాబు. 2008లో కేంద్రానికి టిడిపి తరపున లేఖ రాశారు. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ తెచ్చుకున్నది చంద్రబాబే. హైదరాబాద్ పోవడం వల్ల 1.80 లక్షల కోట్ల రెవెన్యూ ఏపీకి పోయింది. జనాభా వల్ల అప్పు ఎక్కువ వచ్చింది తప్ప ఏపీకి మరేమీ రాలేదు. అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు ఏం సాధించారు..? పోలవరం ప్రాజెక్టు నిధులు గురించి కూడా స్పష్టమైన హామీ తెలేక పోయారు. వైసిపి హయాం లో రామాయపట్నం పోర్టు కడుతున్నం. కడప స్టీల్ ప్లాంట్ జిందాల్ స్టీల్ సంస్థ కట్టేందుకు ముందుకు వచ్చింది. చంద్రబాబు రాజాకీయ విధానాల వల్లే రాష్ట్రానికి అప్పులు. ఏపీలో వేల కిలోమీటర్లు రోడ్ లు వేశాం. సీపీఎస్ గురించి అలోచించి భవిష్యత్ లోనూ.ఇబ్బందులు రాకుండా జీపీఎస్ అమలు చేశాం” అని మంత్రి బుగ్గన చెప్పారు.