ఈ సంక్రాంతికి నాలుగు తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. జనవరి 12న ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’ సినిమాలు విడుదలవుతుండగా.. జనవరి 13న ‘సైంధవ్’, జనవరి 14న ‘నా సామి రంగ’ పలకరించనున్నాయి.
గుంటూరు కారం:
‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ పట్ల క్రేజ్ ఉండటం, సంక్రాంతికి వస్తున్న చిత్రాల్లో ఇదే భారీ సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కలగలిసి.. యూత్, ఫ్యామిలీ, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా ఇది అవుతుందని చిత్రం బృందం నమ్ముతోంది.
హనుమాన్:
టీజర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం హనుమాన్. కుర్ర హీరో తేజ సజ్జాతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో ఫిల్మ్ టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. కిడ్స్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టార్స్ లేనప్పటికీ.. స్టార్స్ సినిమాల స్థాయిలో సత్తా చాటుతుందనే అభిప్రాయాలు హనుమాన్ పై ఉన్నాయి.
సైంధవ్:
వెంకటేష్ 75వ సినిమాగా రూపొందిన చిత్రం ‘సైంధవ్’. ‘హిట్’ ఫ్రాంచైజ్ తో ఆకట్టుకున్న శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. యాక్షన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారితో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పించే అవకాశముంది.
నా సామి రంగ:
నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ డైరెక్షన్ లో తెరకెకెక్కిన సినిమా ‘నా సామి రంగ’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్ కలగలిసిన ట్రైలర్ తో అసలుసిసలైన పండగ సినిమాగా ఇది ప్రచారం పొందింది. యూత్, మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఈ సినిమా అలరించే ఛాన్స్ ఉంది.
ఈ నాలుగు చిత్రాల్లో ప్రేక్షకులు ఏ సినిమాకి ఓటు వేస్తారో, ఏ సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుందో చూడాలి.