Home వీడియోస్ Harsha kumar: ఆ రాష్ట్రంలో చెల్లని నాణెం.. ఈ రాష్ట్రంలో చెల్లుతుందా? షర్మిలపై కాంగ్రెస్ మాజీ...

Harsha kumar: ఆ రాష్ట్రంలో చెల్లని నాణెం.. ఈ రాష్ట్రంలో చెల్లుతుందా? షర్మిలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ

0

తెలంగాణలో చెల్లని నాణెం.. ఆంధ్రలో ఎలా చెల్లుతుందని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష కుమార్ ఘాటుగా మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఆంధ్రలో కాంగ్రెస్ కి నాయకత్వం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడిన, తెలంగాణ కోసం మాట్లాడిన షర్మిలకు, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇస్తే ఎలా అని అడిగారు. ఇప్పటికే ఏపీని విభజించి కాంగ్రెస్ పాపం కట్టుకుందని, మరో తప్పు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ పార్టీని ఏపీలోని నడిపించేందుకు పటిష్ఠమైన నాయకత్వం ఉందని స్పష్టం చేశారు. వైఎస్ షర్మిల.. జగన్ డైరెక్షన్ లోనే నడుస్తోందని ఆరోపణలు చేశారు. ఇటువంటి సందర్భంగా షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అసలే ఇవ్వకూడదని హర్ష కుమార్ స్పష్టం చేశారు.

Exit mobile version