Home ఎంటర్టైన్మెంట్ సుకుమార్ పై పుష్ప 2 నిర్మాత సంచలన కామెంట్స్… వైరల్ గా మారిన పోస్టర్

సుకుమార్ పై పుష్ప 2 నిర్మాత సంచలన కామెంట్స్… వైరల్ గా మారిన పోస్టర్

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ  పుష్ప తో భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర దర్శకుల్లో ఒకరిగా గుర్తింపుని పొందిన దర్శకుడు సుకుమార్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా పుష్ప అండ్ పుష్ప 2 నిర్మాణ సంస్థ  సోషల్ మీడియా వేదికగా ఆయనకి శుభాకాంక్షలు చెప్తు  రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ది క్రియేటర్, ది విజనరీ అనే వర్డ్స్ తో సుకుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తు మైత్రి మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. అంతే కాకుండా మావెరిక్ దర్శకుడికి మరియు విస్మయపరిచే ప్రపంచాన్ని సృష్టించిన పుష్పకు అని సంబోధించడంతో పాటుగా ఆర్య సుక్కు అని కూడా సదరు సంస్థ సంబోధించింది. అలాగే అతని దృష్టి చాలా పెద్దదిగా మరియు గొప్పగా ఉంటుందని అగస్ట్ 15 న  మా పుష్ప 2  ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుందని కూడా మైత్రి వారు  తెలిపారు.



 

పుష్ప మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో పుష్ప 2  కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న జోడి కడుతుండగా ఫాహద్ ఫాజిల్, అనసూయలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మొదటి పార్ట్ ని మించి పుష్ప 2 కి  ట్యూన్స్ ని ఇవ్వబోతున్నాడు.

Exit mobile version