ఏ భాషకి చెందిన సినిమా పరిశ్రమలో అయినా హీరో సినీ కెరీర్ కొనసాగినట్టుగా హీరోయిన్ కెరియర్ కొనసాగదు అనే మాట ప్రచారంలో ఉంది. కానీ అలాంటి మాటలన్నింటిని పటాపంచలు చేసిన అతితక్కువ మంది నటీమణుల్లో ఒకరు నయనతార(Nayanthara)సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు సుమారు రెండు దశాబ్దాలపై నుంచి తెలుగు, తమిళ, కన్నడ హిందీ భాషలకి చెందిన ఎన్నో చిత్రాల్లో నటిస్తు నేటికీ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉంది. తాజాగా నయన్ కి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. .
నయనతార నుంచి జవాన్ తర్వాత అన్నపూరణి( annapoorani)అనే మూవీ వచ్చింది. కేవలం తమిళంలోనే రిలీజ్ అయిన ఆ మూవీ ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఇటీవల నెట్ ఫ్లిక్స్(netflix)ద్వారా ఓటిటి లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ రిలీజే అన్నపూరణి కి శాపమైంది. మూవీలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు చిత్ర యూనిట్ మీద మండి పడుతున్నారు. పైగా రమేష్ సోలంకి అనే వ్యక్తి నయనతారతో పాటు చిత్ర యూనిట్ పై కేసు కూడా పెట్టాడు. దీంతో అన్నపూరణి ని ప్రదర్శించే సదరు డిజిటల్ సంస్థ తమ స్ట్రీమింగ్ నుంచి ఆ చిత్రాన్ని తొలిగించింది. అంతే కాకుండా ఎవర్ని నొప్పించే ఉద్దేశం లేదనే ఒక వివరణని కూడా నెట్ ఫ్లిక్స్ ఇచ్చింది.
ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అన్నపూరణి కి చిన్నప్పటినుంచి పెద్ద చెఫ్ అవ్వాలనే కోరిక ఉంటుంది.ఈ క్రమంలో ఆమె కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ని కూడా చేస్తుంది. ఈ విషయంలోనే బ్రాహ్మణ సంఘాల నుంచి నిరసన వ్యక్తం అయ్యింది. టైటిల్ రోల్ ని నయన తార పోషించింది.