Home ఎంటర్టైన్మెంట్ ‘దేవర’ గ్లింప్స్.. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు!

‘దేవర’ గ్లింప్స్.. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు!

0

ఎవరైనా బిగ్ స్టార్ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే చాలు.. అది దానికి కాపీ, దీనికి ఫ్రీమేక్ అంటూ కొందరు రకరకాల ప్రచారాలు చేస్తుంటారు. తాజాగా ‘దేవర’ గ్లింప్స్(Devara Glimpse) విషయంలో కూడా కొందరు అలాంటి ప్రచారాలే చేస్తున్నారు.

‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర'(Devara). ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ కావడంతో ‘దేవర’పై భారీ అంచనాలున్నాయి. ఇక ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లింది. కొరటాల ఈ రేంజ్ అవుట్ పుట్ ఇస్తాడని ఊహించలేదంటూ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయని.. ఒక్క మాటలో చెప్పాలంటే దేవర గ్లింప్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం ఇది నిజంగానే హాలీవుడ్ సినిమాకి కాపీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

‘దేవర’ గ్లింప్స్ లోని కొన్ని షాట్స్ హాలీవుడ్ మూవీ ‘వికింగ్స్’కి కాపీ అంటూ కొందరు డైరెక్టర్ కొరటాలను ట్రోల్ చేస్తున్నారు. ‘సముద్రంలో పడవలు’, ‘నీటిలో పడిపోతున్న ఆయుధాలు’, ‘నీటితో కలిసిపోతున్న రక్తం’ వంటి షాట్ లను పక్కపక్కన పెట్టి.. రెండు సినిమాల్లో షాట్ లు ఒకేలా ఉన్నాయంటూ ట్రోల్స్ తో విరుచుకు పడుతున్నారు. నిజానికి ఆ రెండు సినిమాల షాట్ లు వేటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. అయినా పోల్చడం అంటూ మొదలుపెడితే.. ప్రతి సినిమాలోని షాట్, ఏదో ఒక సినిమాలోని షాట్ ని పోలి ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించక కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఆ ట్రోలర్స్ కి అంతే ధీటుగా బదులిస్తున్నారు. మన తెలుగు సినిమా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో రూపొందుతోందని గర్వపడాల్సింది పోయి.. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లుగా, ఏదో సినిమాలోని కొన్ని షాట్స్ తీసుకొచ్చి.. కాపీ ఆరోపణలు చేయడం ఏంటని మండిపడుతున్నారు.

Exit mobile version