ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్
నిత్యం చెత్త సేకరిస్తూ అనారోగ్యానికి గురవుతున్న స్వచ్ఛ ఆటో కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. స్వచ్ఛ ఆటోలు, ఓనర్ కం డ్రైవర్లను మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసి, నెలకు రూ.24 వేల కనీస వేతనం అందించాలని కోరారు. ఇదే విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, తమ సమస్యలను పరిష్కరించి, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా స్వచ్ఛ ఆటో డ్రైవర్ల ఆందోళనతో నగరంలో చెత్త సేకరణ ప్రక్రియ నిలిచిపోగా.. శానిటేషన్ సిబ్బంది చెత్తను తొలగించే పనులు చేపట్టారు. కాగా స్వచ్ఛ ఆటోడ్రైవర్ల ఆందోళన ఇలాగే కొనసాగితే నగరంలోని ఇండ్లలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయే ప్రమాదం ఉంది. మరి కార్మికుల సమస్యకు అధికారులు ఏవిధంగా పరిష్కారం చూపుతారో చూడాలి.