మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. గుంటూరు జిల్లా నంబూరులో జరిగిన ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతోపాటు హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లాంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. మహేష్ బాబును చూసేందుకు భారీగా అభిమానులు హాజరయ్యారు. దీంతో వారిని కంట్రోల్ చేయటం పోలీసుల వల్ల కాలేదు. ఫ్యాన్సు రచ్చ రచ్చ చేయటంతో తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా పలువురు గాయపడ్డారు.