Salar Jung Museum Recruitment 2024 Updates: సాలార్‌జంగ్ మ్యూజియంలోని పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా… గ్రూప్-ఎ, బి, సి కేటగిరి పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో క్యూరేటర్, డిప్యూటీ క్యూరేటర్, అకౌంటెంట్, సీనియర్ ఫొటోగ్రాఫర్, గ్యాలరీ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆఫ్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ప్రచురితమైన తేదీ నుంచి 45 రోజుల లోపు దరఖాస్తులను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…