గోవాలో ఉండి మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడిని చంపిన విషయంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. సుచనా ఉన్న సర్వీస్ అపార్ట్మెంట్లో దగ్గు మందు ఖాళీ బాటిళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బహుశా ఆమె పిల్లోడికి భారీ డోసు ఇచ్చి ఉంటుందని భావిస్తున్నారు. నెల రోజుల నుంచి పక్కా ప్లానింగ్‌తోనే ఈ మర్డర్ జరిగి ఉంటుందని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఆ పిల్లాడి అంత్యక్రియలు బెంగళూరులో నిర్వహించారు.