మతం ప్రస్తావనే లేదు
హనుమంతుడిలో హిందూ మతం ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, అన్ని మతాలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుంటుందా? అన్నదానికి.. ”ఈ సినిమాలో మతం ప్రస్తావనే లేదు. హనుమంతుడి పాత్ర మాత్రమే ఉంది. హనుమంతుడిని గౌరవించే, ప్రేమించే ఇతర మతాలకు చెందిన వారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్లో పనిచేసిన చాలా మంది ఇతర మతాలకు చెందిన వారే. మా టీమ్ అంతా ఈ సినిమాకి బెస్ట్ ఇచ్చారు. హనుమంతుడు అన్ని వయసుల వారిని మెప్పించే విధంగా ఉండబోతుంది. ఈ సినిమాలో మీకు ఇబ్బంది కలిగించే ఒక్క ఎలిమెంట్ కూడా లేదు. మీరు మీ కుటుంబంతో కలిసి వెళ్లి, సరదాగా గడపవచ్చు” అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.