Chandrababu : సీఎం జగన్ అప్పుల అప్పారావంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీడీపీ నిర్వహించిన ‘రా…కదలి రా’ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ…సీఎం జగన్ రాష్ట్రంలోని అన్ని రంగాలను రివర్స్ గేర్ లో పెట్టి, ఆయన మాత్రం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని విమర్శించారు. వైసీపీ పాలనలో పేదలు సంక్రాంతి పండుగను కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వం పండుగ సమయంలో సంక్రాంతి కానుక పేరుతో ఉచితంగా సరకులిచ్చామన్నారు.