Home ఎంటర్టైన్మెంట్ నాని పై ఎన్టీఆర్ దేవర హీరోయిన్ కామెంట్స్

నాని పై ఎన్టీఆర్ దేవర హీరోయిన్ కామెంట్స్

0

నాచురల్ స్టార్ నాని (nani) హీరోగా మృణాల్ ఠాకూర్ (mrunal thakur) హీరోయిన్ గా నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో గత నెల డిసెంబర్ 7 న  వచ్చిన సినిమా హాయ్ నాన్న.విడుదలైన అన్ని చోట్ల సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్ లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.  తాజాగా ఒక హీరోయిన్  హాయ్ నాన్న గురించి      ప్రస్తావించడం ప్రాధాన్యతని సొంతం చేసుకుంది. 


అలనాటి అందాల నటి శ్రీదేవి ముద్దుల కూతురు  జాన్వీ కపూర్ (janhvi kapoor) ఇటీవలే  హాయ్ నాన్న(hi nanna) చూసింది.  హాయ్ నాన్న తన మనసుని చాలా దగ్గరగా  తాకిందని హీరో నాని హీరోయిన్ మృణాల్ లు తమ అధ్బుతమైన  పెర్ఫార్మన్స్ తో మెప్పించారని చెప్పింది. అలాగే దర్శకుడు శౌర్యువ్ టేకింగ్ కూడా చాలా  బాగుందని చెప్పడంతో పాటు  హాయ్ నాన్న  టీమ్ మొత్తానికి  ప్రత్యేకంగా శుభాభినందనలని  కూడా  తెలియచేస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో  పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం జాన్వీ పెట్టిన  ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ప్రస్తుతం దేవర లో ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తుంది.

 

ఇటీవలే ఓటిటి లో కూడా హాయ్ నాన్న విడుదలయ్యి అశేష  తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించింది. కియారా అద్వానీ,  జయరాం, నాజర్, ప్రియదర్శిని  తదితరులు కీలక పాత్రలు పోషించారు. శృతి హాసన్ ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసిన హాయ్ నాన్న ని  వైరా ఎంటర్ టైనేమెంట్స్ పై మోహన్, విజేందర్ రెడ్డి, మూర్తి నిర్మించారు.

 

Exit mobile version