Virat Kohli: అప్ఘనిస్థాన్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న సిరీస్‌తో దాదాపు దాదాపు రెండేళ్ల తర్వాత టీ20ల్లోకి సీనియర్ క్రికెటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రీఎంట్రీ ఇస్తోన్నారు. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా తరఫున కోహ్లి, రోహిత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ తో ఆడిన మ్యాచే టీమిండియా తరఫున వీరిద్దరికి చివరి టీ20 మ్యాచ్. ఆ తర్వాత పొట్టి ఫార్మెట్కు బీసీసీఐ వారిద్దరిని దూరం పెట్టింది. టీ20 కెప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యకు అప్పగించింది. ఇటీవల హార్దిక్ పాండ్య కూడా గాయపడటంతో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్‌కు సారథ్య బాధ్యతల్ని చేపట్టారు. కానీ రోహిత్, కోహ్లిలను మాత్రం జట్టులోకి రాలేదు.