Food for Reduce stress: ఆధునిక జీవితంలో ఎంతో మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఒక పక్క ఉద్యోగ సమస్యలు, మరొక పక్క ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు… ఇవన్నీ కూడా మనిషిలో తీవ్ర ఒత్తిడికి కారనమవుతున్నాయి. ముఖ్యంగా సెలవులు తీసుకుని తిరిగి ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఎంతో మంది ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సెలవుల్లో, పండుగల సమయంలో అధిక చక్కెర, ఉప్పులు కలిపిన ఆహారాన్ని అధికంగా తింటారు. దీని వల్ల కూడా ఒత్తిడి స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. పరిశోధన ప్రకారం ఒత్తిడిని తట్టుకోవడానికి మన శరీరానికి మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఐరన్, నియాసిన్ నిండి ఉన్న ఆహారాలని తినాలి. అనారోగ్యకరమైన ఆహారాలు తిన్నప్పుడు పొట్టలోని మంచి బ్యాక్టిరియా ప్రభావితం అవుతుంది. ఇది మన మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల ఒత్తిడి కలిగే అవకాశం ఉంది.