India vs England Test 2024 Free Tickets: సాధారణంగా క్రికెట్‌ను స్టేడియంలో చూడాలంటే టికెట్స్ కొనుక్కుని చూడాలి. ఎలాంటి మ్యాచ్‌కు అయినా సరే టికెట్స్ కచ్చితంగా కొనాల్సిందే. కానీ, ఈసారి మాత్రం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వినూత్న ఆలోచనతో ముందుకు రానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌ను ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. కానీ, కొంతమందికే ఈ బంఫర్ ఆఫర్ ప్రకటించింది హెచ్‌సీఏ.