‘గుంటూరు కారం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో శ్రీలీల కట్టుకున్న చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందరో లేడీ ఫ్యాన్స్ ఆ చీర గురించి, ఆ చీర ధర గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఆ శారీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది కానీ, ధరే కళ్ళు చెదిరేలా ఉంది. ఆ చీర ధర రూ.1,59,000 నుంచి రూ.2,06,700 మధ్య ఉంది. ఒక చీర ధర రూ.2 లక్షలు ఉండటంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.