Wednesday, October 30, 2024

వైసీపీకి మరో షాక్, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా!-kurnool news in telugu mp sanjiv kumar tender resignation to ysrcp mp post ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

MP Sanjiv Kumar : వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నాయి. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. కర్నూలు పార్లమెంట్ పార్టీ ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పించడంతో సంజీవ్ కుమార్ మనస్తాపం చెందారు. దీంతో తన ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సంజీవ్ కుమార్ ప్రకటించారు. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని సంజీవ్ కుమార్ అన్నారు. తన సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. మరో 20 ఏళ్ల వరకు తాను ప్రజా జీవితంలో ఉంటానన్నారు. ఎంపీగా అభివృద్ధి చేసే అవకాశం తనకు రాలేదన్నారు. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తానన్నారు. వలసలు ఆగాలంటే పెద్దస్థాయిలో నిర్ణయాలు జరగాలన్నారు. అధిష్టానం అపాయింట్మెంట్ కోరితే ఎందుకు కష్టపడతావన్నారని ఎంపీ సంజీవ్ కుమార్ తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana