మార్గశిర అమావాస్య రోజు దానం, స్నానానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో దర్భ గడ్డి ఉంగరం ధరించి శ్రార్ధ ఖర్మలు నిర్వహిస్తారు. ఈరోజు దానం చేయడం వల్ల పితృ దోషం దుష్ప్రభావాలు తగ్గుతాయి. ఆవులు, కాకులు, కుక్కలకు ఈరోజు ఆహారం పెట్టాలి. పవిత్రమైన రోజున పూర్వీకులకు సంబంధించిన పనులు, వారి పేరు మీద దానధర్మాలు చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు. ఈరోజు చేసే దానం ఎన్నో రెట్లు ఫలితం దక్కుతుంది. విష్ణువుని పూజించి ఉపవాసం ఉండటం వల్ల బాధలు, ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది.