Home ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు భారీ ఊరట- ఐఆర్ఆర్, లిక్కర్, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్-amaravati news in telugu...

చంద్రబాబుకు భారీ ఊరట- ఐఆర్ఆర్, లిక్కర్, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్-amaravati news in telugu ap high court bail to chandrababu in irr sand liquor cases ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

Chandrababu Bail : టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. లిక్కర్, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. లిక్కర్, ఐఆర్ఆర్, ఇసుక వ్యవహారాల్లో అవినీతి జరిగిందని ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు ముగియగా, తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. తాజాగా బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Exit mobile version