Day trading guide మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల మధ్య ఈక్విటీ బెంచ్ మార్క్ లు అయిన సెన్సెక్స్, నిఫ్టీ 50 మంగళవారం ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 31 పాయింట్లు లేదా 0.04 శాతం పెరిగి 71,386.21 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 21,544.85 వద్ద స్థిరపడ్డాయి. బిఎస్ ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం స్వల్ప లాభంతో ముగిసింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.37 శాతం లాభంతో ముగిసే సమయానికి 44,110.68 వద్ద సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది.