సంక్రాంతి పండుగకి వస్తున్న గుంటూరు కారం,(Guntur kaaram హనుమాన్( hanuman)సైంధవ్,( sanidhav)నా సామి రంగ (naa saami ranga)సినిమాలని చూడటానికి మూవీ లవర్స్ సిద్ధం అయ్యారు. ఆ నాలుగు సినిమాలు థియేటర్స్ లోఅడుగుపెట్టడానికి కౌంట్ డౌన్ కూడా ప్రారంభం అయ్యింది. ఏ సినిమా ఏ థియేటర్లో ఆడుతుందనే లిస్ట్ కూడా వచ్చింది. తాజాగా ఆ నాలుగు సినిమాలకి సంబంధించిన ఇంకో లిస్ట్ కూడా బయటకి వచ్చింది.
జనవరి 12 న విడుదల అవుతున్న గుంటూరు కారం మహేష్ కెరీర్ పైనే అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకోగా శాటిలైట్ హక్కులని జెమినీ ఛానెల్ సొంతం చేసుకుంది. ఇక 12 నే హనుమాన్ కూడా నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. హైదరాబాద్ లాంటి ఏరియాలో ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ షో జరుపుకుంటుంది. హనుమాన్ శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ ని జీ సంస్థ దక్కించుకుంది.
ఇక 13 న విడుదల అయ్యే వెంకటేష్ సైంధవ్ ని అమెజాన్ అండ్ ఈనాడు టెలివిజన్ దక్కించుకోగా నాగార్జున నా సామి రంగ ని స్టార్ మా, డిస్నిప్ హాట్ స్టార్ లు దక్కించుకున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాలుగు సినిమాలు కూడా కథ పరంగా ఎలా అయితే ఒక దానికొకటి సంబంధం లేదో అలాగే నాలుగు సినిమాల శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కులు కూడా ఒక దానికొకటి సంబంధం లేదు.