Home ఎంటర్టైన్మెంట్ అలా అయితే నాని, శైలేష్‌ల ‘హిట్‌ 3’ ఇప్పట్లో లేనట్టే?

అలా అయితే నాని, శైలేష్‌ల ‘హిట్‌ 3’ ఇప్పట్లో లేనట్టే?

0

విశ్వక్‌సేన్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్‌’ సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా అడివి శేష్‌ హీరోగా ‘హిట్‌ 2’ రూపొందింది. ఈ సినిమా ఎండిరగ్‌లో ‘హిట్‌3’కి సంబంధించిన హింట్‌ కూడా ఇచ్చాడు శైలేష్‌. ఇందులో నాని హీరోగా నటించనున్నాడు. అడివి శేష్‌ హీరోగా వచ్చిన ‘హిట్‌2’ రిలీజ్‌ అయి సంవత్సరం దాటింది. కానీ, ‘హిట్‌ 2’ సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. ఈ సినిమా తర్వాత ఎక్కువగా గ్యాప్‌ తీసుకున్న శైలేష్‌ తాజాగా వెంకటేశ్‌ హీరోగా ‘సైంధవ్‌’ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. మరోపక్క నాని వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. మరి ‘హిట్‌3’ ప్రాజెక్ట్‌ ఉంటుందా లేదా అనే విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం శైలేష్‌ ‘సైంధవ్‌’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ‘హిట్‌3’ గురించి ప్రశ్నించగా ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ఏడాదిన్నర తర్వాతే స్టార్ట్‌ అవుతుందని స్పష్టం చేశాడు. 

ఈ మూడో భాగానికి సంబంధించి కాన్సెప్ట్‌ సిద్ధంగానే ఉన్నప్పటికీ ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీ చెయ్యాల్సి ఉంది. నాని ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతను అందుబాటులోకి రావాలంటే చాలా టైమ్‌ పడుతుంది. అప్పుడే పార్ట్‌ 3 ప్రారంభమవుతుందని తెలిపాడు. ఈ సినిమా కాకుండా యదార్థ ఘటనల ఆధారంగా ఓ సినిమా చేసే ఆలోచనలో శైలేష్‌ ఉన్నట్టు తెలుస్తోంది. తన జీవితంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఓ ప్రేమకథ రాశానని, దాన్నే సినిమాగా చెయ్యాలన్న ఆలోచన ఉందని తెలియజేశాడు. ‘సైంధవ్‌’ రిలీజ్‌ అయిన తర్వాత దాని రిజల్ట్‌ని బట్టి నెక్స్‌ట్‌ ఏ ప్రాజెక్ట్‌ చెయ్యాలన్నది డిసైడ్‌ చేస్తానని అంటున్నాడు శైలేష్‌. 

 

Exit mobile version