తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘలు ఛలో విజయవాడకు పిలుపిచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎక్కడికక్కడ టీచర్ల అరెస్టులు మెుదలు పెట్టారు. ఈ క్రమంలోనే పలుచోట్ల ఉద్రిక్తతలు తలెత్తాయి. విజయవాడలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ప్రభుత్వం హమీలు అమలు చేయకుండా మోసం చేసిందంటూ టీచర్లు ఆరోపిస్తున్నారు. ప్రతి నెల 1న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రూ. 18 వేల కోట్లు ఉపాధ్యాయుల సొమ్ము ఉద్యోగుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.