కారణం ఏంటి?
యూజీసీ నెట్ డిసెంబర్ 2023 (UGC NET December 2023) ఫలితాలను ప్రకటించే తేదీలను ఎన్టీఏ మార్చడానికి ప్రధాన కారణం చెన్నై, ఆంధ్రప్రదేశ్ లలో వచ్చిన వరదలే. చెన్నై, ఆంధ్ర ప్రదేశ్ ల్లో తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా, అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రీ ఎగ్జామ్ నిర్వహిాంచాల్సి వచ్చింది. దాంతో, ఫలితాలను విడుదల చేసే తేదీని కూడా మార్చాల్సి వచ్చింది. తాజాగా, ఈ ఫలితాలను జనవరి 17వ తేదీన ప్రకటిస్తామని ఎన్టీఏ (NTA) వెల్లడించింది. అభ్యర్థులు జనవరి 17 నుంచి అధికారిక వెబ్ సైట్స్ అయిన nta.ac.in, లదేా ugcnet.nta.ac.in లలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.